News November 7, 2024

NZB: చిన్నారిని హత్య చేసిన తల్లితో పాటు మరొకరికి జీవిత ఖైదు

image

మూడేళ్ల కూతురును హత్య చేసిన తల్లితో పాటు మరోవ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పారు. జిల్లాలోని బోధన్ మండలం కల్దుర్కికి చెందిన సంజీవ్, మోర్తాడ్కు చెందిన కూలీ రజిత అలియాస్ రాధతో సహజీవనం చేస్తూ రాధ కూతురు తమకు అడ్డుగా ఉందని భావించారు. దీనితో 2023లో చిన్నారిని కొట్టి నీటిలో ముంచి చంపినట్లు కేసు నిర్దారణ అయ్యింది.

Similar News

News February 28, 2026

నవీపేట్‌: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

image

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

image

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.