News August 2, 2024

NZB: చిన్నారిపై లైంగిక దాడి.. పోక్సో కేసు

image

నిజామాబాద్ నగరంలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడగా నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసినట్లు టూ టౌన్ ఎస్సై రాము తెలిపారు. పూసలగల్లీ ప్రాంతంతో ఓ బాలిక(5) ఇంటి ఎదుట ఆడుకుంటుండగా గణేశ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. చాక్లెట్ ఇప్పిస్తానంటూ బాలికను తన ఇంటికి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు బాధిత కుటుంబసభ్యులు గురువారం ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని SI తెలిపారు.

Similar News

News September 16, 2024

NZB: రేపు జిల్లాల్లో జెండా ఎగురవేసే ప్రముఖులు వీరే!

image

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల్లో జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. నిజామాబాద్‌లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, కామారెడ్డిలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశడ్డి, ఆదిలాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జెండాను ఎగురవేయనున్నారు.

News September 16, 2024

మోపాల్: వైద్య సిబ్బందికి మెమోలు జారీ చేసిన DM&HO

image

మోపాల్ మండలంలోని ముదక్పల్లి PHCలో ఆయూష్ వైద్యురాలికి, సిబ్బందికి DM&HO రాజశ్రీ మెమోలు జారీ చేశారు. ఇటీవల PHCని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేసిన సమయంలో వారు విధులకు గైర్హాజరు అయ్యారు. విధులకు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో వారికి కలెక్టర్ నోటీసులిచ్చారు. కాగా PHC ఇన్‌ఛార్జ్ డ్రాయింగ్ ఆఫీసర్‌గా డిప్యూటీ DM&HO అంజనకు బాధ్యతలు అప్పగించారు.

News September 16, 2024

NZB జిల్లాలో 2వేల మందితో భారీ బందోబస్తు

image

గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2వేల మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు మల్టీ జోన్-1 IGP చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వినాయకుల ఊరేగింపులో ఆకతాయిలను, జేబు దొంగలను నియంత్రించడానికి క్రైమ్, స్పెషల్ బ్రాంచ్, షీ టీమ్‌లను మఫ్టీలో, పోలీసు భద్రత సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.