News June 13, 2024

NZB: చిన్నారి దారుణ హత్య

image

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. NZB జిల్లా రెంజల్ మండలానికి చెందిన నవ్యశ్రీకి అదే మండలానికి చెందిన లక్ష్మణ్‌తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి అరుణ్య, మహన్వి(22నెలలు) కుమార్తెలున్నారు. 7 నెలల క్రితం అరవిందరెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తను వదిలేసి చిన్నారులతో నల్గొండ జిల్లాకు వెళ్లి నివాసం ఉంటోంది. తన వివాహేతర సంబంధానికి మహన్వి అడ్డువస్తోందని అరవిందరెడ్డి హతమార్చాడు.

Similar News

News February 11, 2025

నవీపేట్: చదువు అర్థం కావడం లేదని విద్యార్థి ఆత్మహత్య

image

నవీపేట్ మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన అభిషేక్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అవ్వడంతో తల్లదండ్రులు మళ్లీ ఒప్పించి కాలేజీలో జాయిన్ చేశారు. తన తోటి ఫ్రెండ్స్‌తో చదువు అర్థం కావడం లేదని మనస్థాపం చెంది గత నెల 27వ తేదీన పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలిచగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 11 గంటలకు మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.

News February 11, 2025

NZB: జిల్లా ఓటర్ల వివరాలు

image

నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్‌, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 33 మండలాల్లో 48 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 31,574 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో 19,993 మంది పురుషులు, 11,581 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు వివరించారు.

News February 11, 2025

NZB: జిల్లా ఓటర్లు ఎంతమందంటే?

image

నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ కౌన్సిల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని ఓటర్ల వివరాలను అధికారులు సోమవారం ప్రకటించారు. జిల్లాలోని మొత్తం 33 మండలాల్లోని 33 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 3,751 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో నిజామాబాద్ డివిజన్‌లో 2001, ఆర్మూర్ డివిజన్‌లో 1049, బోధన్ డివిజన్లో 701 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు.

error: Content is protected !!