News March 20, 2025

NZB: చివరి రోజు 438 ఆబ్సెంట్

image

జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు 22వ తేదీన నిర్వహించనున్నట్లు DIEO రవికుమార్ తెలిపారు. గురువారం రెండో సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించారు. 438 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 15,896 మంది విద్యార్థులకు 15,458 మంది పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. మొత్తం 97.2% విద్యార్థులు పరీక్షలు రాశారు.

Similar News

News November 20, 2025

నిజామాబాద్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, ఇందల్వాయి, రెంజల్, డొంకేశ్వర్, ఆలూర్, నందిపేట్, బాల్కొండ, ముప్కాల్, మోర్తాడ్, వేల్పూర్, మాక్లూర్, జక్రాన్ పల్లి, ఏర్గట్ల, కోటగిరి, పొతంగల్, వర్ని, మోస్రా మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <>క్లిక్<<>> చేసి వివరాలు నమోదు చేయండి.

News November 20, 2025

అక్రమ కేసులతో కట్టడి చేయాలనుకుంటే పొరపాటే: వేముల

image

అక్రమ కేసులతో బీఆర్‌ఎస్, కేటీఆర్‌ను కట్టడి చేయాలనుకోవడం పొరపాటేనని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా, హామీలు అమలు చేసేవరకు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతుంటామని ఆయన స్పష్టం చేశారు.

News November 20, 2025

NZB: మూగజీవాలను సైతం వణికిస్తున్న చలి

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రజలలో వణికిస్తున్న చలిపులి మూగజీవాలను సైతం వదలడం లేదు. చలికి మనుషులతో పాటు మూగజీవాలు కూడా గజగజ వణుకుతున్నాయి. కొందరు చలిమంట వేసుకుంటూ చలి నుంచి ఉపశమనం పొందుతుండగా వారు వేసుకున్న చలిమంట వద్ద మూగజీవాలు సేదదీరుతున్నాయి. NZB నగరంలో రెండు కుక్క పిల్లలు వెచ్చదనం కోసం ఇలా చలి మంటకాచుకుంటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.