News March 20, 2025
NZB: చివరి రోజు 438 ఆబ్సెంట్

జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు 22వ తేదీన నిర్వహించనున్నట్లు DIEO రవికుమార్ తెలిపారు. గురువారం రెండో సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించారు. 438 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 15,896 మంది విద్యార్థులకు 15,458 మంది పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. మొత్తం 97.2% విద్యార్థులు పరీక్షలు రాశారు.
Similar News
News April 22, 2025
చందూర్: ఉరేసుకొని రైతు ఆత్మహత్య

చందూరు మండల కేంద్రంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అర్కల గోపాల్ రెడ్డి(46) పొలం పెట్టుబడి, పురుగుమందుల కోసం ఫర్టిలైజర్ షాపులో అరువుగా మందులు తీసుకువచ్చి డబ్బులు చెల్లించకపోవడంతో ఫర్టిలైజర్ యజమాని కోర్టును ఆశ్రయించారు. కోర్టు నోటీసు పంపించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్ఐ మహేశ్ చెప్పారు.
News April 22, 2025
NZB: దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యా శాఖ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు మండల, జిల్లా స్థాయిలలో శిక్షణ ఇవ్వడానికి సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్ల (MRP, DRP)లను నియమించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ అశోక్ తెలిపారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన దరఖాస్తుల ద్వారా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నియామకం చేపడుతుందన్నారు.
News April 22, 2025
ధర్పల్లి: వడదెబ్బతో రైతు మృతి

ధర్పల్లి మండలం వాడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వడదెబ్బతో కరక రాములు(65) అనే రైతు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇటీవల తన పొలంలో యంత్ర సాయంతో పంట కోయించారు. యంత్రం వెళ్లలేని ప్రాంతంలో మిగిలిపోయిన పంటను ఉదయం నుంచి కోస్తూ వడదెబ్బకు గురై మృతి చెందినట్లు తెలిపారు.