News July 13, 2024
NZB: చీర గొంతుకు చుట్టుకొని బాలుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720837379233-normal-WIFI.webp)
ఎడపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఠాణాకలాన్కు చెందిన నవదీప్(14) మెడకు ప్రమాదవశాత్తు చీర చుట్టుకోవడంతో మృతి చెందాడని SI వంశీకృష్ణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. నవదీప్ సామాన్లు సర్దేందుకు చీర సాయంతో సజ్జపైకి ఎక్కాడు. దికే క్రమంలో ప్రమాదవశాత్తు చీర మెడకు చుట్టుకుని ఉరిపడింది. బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
Similar News
News February 8, 2025
కామారెడ్డి పెద్ద చెరువులో యువకుడి గల్లంతు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738981697996_718-normal-WIFI.webp)
కామారెడ్డి పెద్ద చెరువులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన చిన్నచెవ్వ రాములు, అతడి చిన్నకొడుకు సాయికుమార్ (24)తో కలిసి శుక్రవారం సాయంత్రం పెద్ద చెరువుకు వెళ్లారు. స్నానం చేసేందుకు సాయికుమార్ చెరువులోకి దిగగా, లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక మునిగిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దేవునిపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
News February 8, 2025
NZB: వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే: జీవన్ రెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738942322074_50139228-normal-WIFI.webp)
వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అనుబంధ సంస్థగా పోలీసు శాఖ పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి జాతకాలు పింక్ బుక్లో ఎక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను అధికారులు, పోలీసులు వేధిస్తున్నారన్నారు.
News February 8, 2025
BJPని గెలిపిద్దాం: కామారెడ్డి MLA
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738979175573_718-normal-WIFI.webp)
పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ BJP గెలవాలని కామారెడ్డి MLA వెంకటరమణరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కామారెడ్డిలో ఆయన మాట్లాడారు. అన్ని చోట్ల BJP గెలిచేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు కృషి చేయాలని, ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా రెడీగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.