News September 29, 2024
NZB: చెత్తకాగితాలు పోగు చేసుకునే వ్యక్తి హత్య

నిజామాబాద్ నగరంలోని మూడో టౌన్ రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో హత్య జరిగింది. 3వ టౌన్ ఎస్సై మహేశ్ వివరాల ప్రకారం.. నవీపేట్కు చెందిన గణేశ్ (30) హత్యకు గురైనట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు శనివారం రాత్రి ఘటనా స్థలానికి వెళ్లగా చెత్త సేకరించుకొని బ్రతికే వ్యక్తిగా గుర్తించారు. గుర్తుతెలియని వారు మెడకి తాడు బిగించి హత్య చేసినట్లు గుర్తించమన్నారు. కేసు నమోదైంది.
Similar News
News October 18, 2025
NZB: దరఖాస్తులకు నేడే చివరి తేదీ

NZB జిల్లాలో మద్యం టెండర్లకు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 102 మద్యం దుకాణాలకు శుక్రవారం వరకు 1419 దరఖాస్తుల స్వీకరించినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్లో 492, బోధన్ 299, ఆర్మూర్ 260, భీమ్గల్ 171 దరఖాస్తులు వచ్చాయన్నారు. శనివారంతో టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. చివరి రోజు దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.
News October 18, 2025
ఎడపల్లి వాసి నేత్ర దానం

ఎడపల్లిలో శుక్రవారం మృతి చెందిన కంటేడి గంగాధర్(60) నేత్ర దానం చేశారు. మృతి చెందిన అనంతరం నేత్రాలను నేత్రదానం చేయాలని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు నేత్రాలను దానం చేశారు. తన మృతి అనంతరం ఇంకొకరికి చూపును ప్రసాదించే సంకల్పంతో నేత్రదానం చేయాలని కుటుంబ సభ్యులకు గంగాధర్ సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News October 17, 2025
నిజామాబాద్: జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో విజ్ఞాన యాత్ర

పసుపు రైతుల నైపుణ్యాల అభివృద్ధి కోసం జిల్లా కేంద్రంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో విజ్ఞాన యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పసుపు రైతులకు కొత్త అవకాశాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగించే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.