News May 9, 2024
NZB: చేరికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి

లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా NZB, ZHB స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రత్యేక వ్యూహం రూపొందించింది. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని, ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా KMR మాజీ వక్స్ బోర్డు ఛైర్మెన్, పలు గ్రామాలకు చెందిన నాయకలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
Similar News
News March 4, 2025
NZB: వర్క్‌ఫ్రం హోమ్.. రూ. 90,300 మోసపోయిన యువతి

వర్క్‌ఫ్రం హోమ్ పేరుతో ఓ యువతి మోసపోయినట్లు నిజామాబాద్ 1టౌన్ SHO రఘుపతి తెలిపారు. రామ్ గోపాల్ స్ట్రీట్‌కు చెందిన యువతి ఫేస్‌బుక్‌లో రిల్స్ చూస్తుండగా వర్క్ ఫ్రం హోమ్ అనే యాడ్ చూసి ఆకర్షితులై ఓ నంబరుకు వాట్సాప్ ద్వారా లింక్ పంపింది. తన బ్యాంక్ వివరాలను పంపి, రిజిస్ట్రేషన్ ఫీ 90,300 ఫోన్ పే ద్వారా చెల్లించింది. దీంతో మోసపోయానని భావించి వన్ టౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
News March 4, 2025
ఆలూర్: గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదంలో గుత్ప వాసి మృతి

ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన చలిగంటి మోహన్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. ఆర్థిక ఇబ్బందుల్లో అప్పులు పెరగడంతో గత ఐదు నెలల క్రితం దుబాయ్ వెళ్లి డెలివరీ బాయ్‌గా పని చేస్తుండగా ఫిబ్రవరి 23న కారు ప్రమాదంలో మరణించాడు. సోమవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మోహన్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు కోరారు.
News March 4, 2025
UPDATE: NZB: లంచం తీసుకున్న ఇద్దరి అరెస్ట్

ఫిర్యాదుదారుని పేరు మీద ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినందుకు రూ.10 వేలు లంచం తీసుకున్న కేసులో సోమవారం ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నిజామాబాద్ జాయింట్ సబ్-రిజిస్ట్రార్-II చెన్న మాధవాణి శ్రీరామ రాజు, కార్యాలయ స్వీపర్ రంగసింగ్ వెంకట్ రావులను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. వారిని హైదరాబాద్‌లోని ఏసీబీ అదనపు కోర్టులో హాజరు పరచనున్నట్లు వారు వివరించారు.