News February 10, 2025
NZB: చైనా ఫోన్లా రేవంత్ రెడ్డి పాలన: కవిత

KCR పాలన ఐఫోన్ లా ఉంటే… రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ఐఫోన్కు, చైనా ఫోన్కు ఎంత తేడా ఉంటదో.. కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందని, చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది కానీ సరిగ్గా పనిచేయదన్నారు. మాయ మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని సీఎం రేవంత్ రెడ్డి బురిడి కొట్టించారని ధ్వజమెత్తారు.
Similar News
News December 14, 2025
NZB: అనాథ శవాలకు అంత్యక్రియలు

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించిన అనాథ శవానికి అంత్యక్రియలను నిర్వహించాలని ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థను కోరారు. దీంతో వారు సంప్రదాయ పద్దతిలో శనివారం అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, కోశాధికారి జయదేవ్ వ్యాస్, యూవీ ఫౌండేషన్ మెంబర్ సతీష్, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
News December 13, 2025
నిజామాబాద్: పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా: బీజీపీ అధ్యక్షుడు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాపై తీవ్ర విమర్శలు చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యనారాయణ రూ.138 కోట్ల నిధులు తెచ్చారని గుర్తు చేశారు. పదేళ్ల పాలన శూన్యమన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
News December 13, 2025
NZB: మరదలిపై అత్యాచారం చేసిన బావకు పదేళ్ల జైలు శిక్ష

మరదలిపై అత్యాచారం చేసిన బావకు నిజామాబాద్ జిల్లా మహిళా కోర్టు జడ్జి దుర్గాప్రసాద్ 10 సంవత్సరాల జైలు శిక్ష రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 2019లో సాయినాథ్ అనే వ్యక్తి భార్య ఇంటి వద్ద లేని సమయంలో NZBలో ఉండే మరదలి వద్దకు వెళ్లి మీ అక్క రమ్మంటోందని చెప్పి బైక్ పై తీసుకెళ్లి ఇంట్లో అత్యాచారం చేశాడు. సాక్షాధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి జైలు శిక్ష ఖరారు చేశారు.


