News February 10, 2025

NZB: చైనా ఫోన్‌లా రేవంత్ రెడ్డి పాలన: కవిత

image

KCR పాలన ఐఫోన్ లా ఉంటే… రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్‌లా ఉందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ఐఫోన్‌కు, చైనా ఫోన్‌కు ఎంత తేడా ఉంటదో.. కేసీఆర్‌కు, రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందని, చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది కానీ సరిగ్గా పనిచేయదన్నారు. మాయ మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని సీఎం రేవంత్ రెడ్డి బురిడి కొట్టించారని ధ్వజమెత్తారు.

Similar News

News March 23, 2025

నిజామాబాదులో వ్యక్తి దారుణ హత్య

image

వేల్పూర్ మండలం పచ్చలనడ్కడలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు మహారాష్ట్రకు చెందిన శంకర్‌గా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన శంకర్, బాలాజీ ఇద్దరు నెల రోజుల నుంచి గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ కూలి పని చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఇరువురు గొడవ పడ్డారు. అనంతరం బాలాజీ కనపడ లేదు. శనివారం దుర్వాసన రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సంజీవ్ మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.

News March 23, 2025

NZB: మునగ చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

image

మునగ చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు టూ టౌన్ ఎస్ఐ అరాఫత్ అలీ తెలిపారు. ఆనంద్ నగర్‌కు చెందిన లక్ష్మణ్(56) ఈ నెల 18వ తేదీన పని కోసం బయటకు వెళ్లాడు. అనంతరం ఓ మునగ చెట్టు కనపడడంతో దానిపైకి ఎక్కిగా చెట్టు విరిగి కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన లక్ష్మణ్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరాకు దర్యాప్తు చేపట్టారు.

News March 23, 2025

భీమ్‌గల్: బాలికతో అసభ్యకర ప్రవర్తన.. యువకుడిపై కేసు

image

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన తీరు భీమ్‌గల్‌లో శనివారం జరిగింది. ఎస్ఐ మహేశ్ ప్రకారం.. మండలానికి చెందిన అక్షయ్ ఇంటి పక్కన నివసిస్తున్న బాలికను తన ఇంట్లోకి లాక్కెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెపారు. మైనర్ కావడంతో ఆర్మూర్ ACP వెంకటేశ్వర్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

error: Content is protected !!