News December 26, 2024
NZB: జల్సాల కోసం బైకు దొంగతనాలు
నిజామాబాద్ జిల్లాలో జల్సాలకు బైకు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపారు. మాక్లూర్ మండలం మామిడిపల్లికి చెందిన కరిపే సుమన్ ఇటీవల దుబాయ్ నుంచి తిరిగి వచ్చి తాగుడుకు, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో నిజామాబాద్, కోరుట్ల, నవీపేటలో బైకు దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రూ.2.5 లక్షల విలువ చేసే 5 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News January 13, 2025
నిజామాబాద్: బాలుడి గొంతుకోసిన చైనా మాంజా
చైనా మాంజా కమ్మర్పల్లిలో కలకలం రేపింది. సోమవారం ఓ వ్యక్తి గాలిపటం ఎగరవేయగా అది తెగిపోయింది. దానికి కట్టిన చైనా మాంజా ఓ బాలుడి(9) గొంతుకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. తల్లిదండ్రులు మీ పిల్లలు బయట ఆడుకునేటప్పుడు గమనిస్తూ ఉండండి. ప్రమాదాలబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.
News January 13, 2025
NZB: ఊరు వాడా ఘనంగా భోగి సంబురం
ఉమ్మడి NZB జిల్లాల్లో సంక్రాంతి సంబురాలు షురూ అయ్యాయి. మూడు రోజుల వేడుకల్లో భాగంగా తొలి రోజు సోమవారం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఊరు వాడా జనం పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకున్నారు. తమ ఇండ్ల ముందు యువతులు, చిన్నారులు రంగు రంగుల ముగ్గులు వేస్తూ..సందడి చేశారు. అటు యువకులు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ గాలి పటాలు ఎగురవేస్తూ..ఎంజాయ్ చేస్తున్నారు.
News January 13, 2025
NZB: ఇద్దరు మహిళలు సూసైడ్ అటెంప్ట్.. కాపాడిన పోలీసులు
బాసర గోదావరిలో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఎస్ఐ గణేశ్ తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన మహిళతో పాటు మహరాష్ట్రలోని నాందేడ్ జిల్లా చెందిన మరో మహిళ గోదావరిలో దూకేందుకు యత్నించగా పోలీసులు కాపాడారు. NZBకు చెందిన మహిళా కుటుంబ సభ్యులతో గొడవపడి గోదావరిలో దూకేందుకు యత్నించగా అటుగా వెళ్తున్న ఎస్సై ఆమెను అడ్డుకున్నారు. నాందేడ్ కు చెందిన మహిళను మహిళ కానిస్టేబుల్ అడ్డుకున్నారు.