News January 2, 2025

NZB: జస్టిస్ షమీం అక్తర్‌ను కలిసిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు

image

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఎస్సీ వర్గీకరణ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ శమీమ్ అక్తర్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. జిల్లా కేంద్రానికి అధికారిక పర్యటన నిమిత్తం చేరుకున్న సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూలు జగన్ మోహన్ గౌడ్, బార్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుభేదార్ ప్రభుత్వ అతిధి గృహంలో కలిసి పూలమాలలు అందజేశారు.

Similar News

News January 8, 2025

NZB: ఓపిక పడితే.. అవే దక్కుతాయి: మహేష్ కుమార్ గౌడ్

image

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓపిక పట్టాలని.. అప్పుడే పదవులు దక్కుతాయని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాలోని డిచ్పల్లిలో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు నిరాశకు గురి కావద్దని, పదవులు ఖచ్చితంగా దొరుకుతాయని సూచించారు. తనకు PCCపదవి దక్కేందుకు 35 సంవత్సరాలు పట్టిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు

News January 8, 2025

డిచ్పల్లి: ఓట్లు వేసేది ప్రజలు.. ఓట్లు వేయించేది మీరు: మంత్రి జూపల్లి

image

ఓట్లు వేసేది ప్రజలు.. ఓట్లు వేయించేది కార్యకర్తలు, నాయకులు అని నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులు నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, గత BRS ప్రభుత్వ అవినీతిని ప్రజలకు విడమరిచి చెప్పాలని, స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని కోరారు.

News January 8, 2025

కేంద్ర రైల్వేశాఖ మంత్రితో ఎంపీ అర్వింద్ భేటీ

image

NZB ఎంపీ ధర్మపురి అరవింద్, జేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంగళవారం దిల్లీలో కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన రైల్వే లైన్ విస్తరణ పనుల గురించి చర్చించారు. ARMR to ADB వయా నిర్మల్ రైల్వే లైన్ గురించి ప్రస్తావించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.