News January 29, 2025

NZB: జానకం పేట గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్య

image

నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సయ్య(60) హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో పడి మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 17, 2025

ఇవాళ ఈ మంత్రం జపిస్తే ‘అకాల మృత్యు భయం’ తొలగుతుంది!

image

కార్తీక సోమవారాలు శివారాధనకు అత్యంత ముఖ్యమైనవి. చివరి వారమైన ఈ రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు. మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే శివానుగ్రహం లభించి, అకాల మృత్యు భయం తొలగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నిష్ఠతో జపిస్తే శివుడు ఎల్లప్పుడూ కాపాడుతారని ప్రతీతి.
*‘ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్’*

News November 17, 2025

మెదక్: సొసైటీ డైరెక్టర్ మృతి

image

చిన్న శంకరంపేట మండలం జంగారాయి సొసైటీ డైరెక్టర్ సిద్ది రెడ్డి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సిద్ది రెడ్డి మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన సిద్ది రెడ్డి కుటుంబాన్ని సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు డైరెక్టర్‌లు వివిధ పార్టీల రాజకీయ నాయకులు పరామర్శించారు.

News November 17, 2025

తిరుపతి: ఇప్పటి వరకు 231 మంది అరెస్ట్

image

ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు రెడ్ శాండిల్ టాస్క్‌ఫోర్స్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పలు కేసులు కేసులు నమోదు చేశారు. 231 మందిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. దాదాపు 1,778 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు వినియోగించిన 57వాహనాలను సీజ్ చేసినట్లు రెడ్ శాండిల్ టాస్క్‌ఫోర్స్ తిరుపతి ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు.