News January 29, 2025
NZB: జానకం పేట గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్య

నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సయ్య(60) హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో పడి మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 19, 2025
BNGR: పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్‌కు ఫిర్యాదు

రాజాపేట మండలం పుట్టగూడెం కార్యదర్శి అవినీతికి పాల్పడుతున్నారని గ్రామస్థులు బుధవారం జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఇళ్ల కొలతలకు ఒక్కొక్కరి వద్ద రూ.10 వేల నుంచి రూ.12 వేలు వసూలు చేశారని, డిజిటల్ సర్వే పేరుతో మోసం చేశారని ఆరోపించారు. పొడవు, వెడల్పు కొలతలు వేయకుండా ప్రైవేటు సర్వేయర్‌తో కుమ్మక్కయ్యారన్నారు. వెంటనే విచారణ చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
News February 19, 2025
ఉద్యోగం వదిలేసి వ్యాపారం.. CM చంద్రబాబు ప్రశంసలు

ఇంజినీర్ ఉద్యోగం వదిలి మిల్లెట్ వ్యాపారం చేస్తున్న బొర్రా శ్రీనివాస రావును CM చంద్రబాబు ప్రశంసించారు. యువతకు స్ఫూర్తినిస్తున్న ఆయన్ను త్వరలో కలుస్తానన్నారు. ‘మన్యం గ్రెయిన్స్’ పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీని ప్రారంభించి 400-500 మంది రైతులకు సాధికారత కల్పించారని పేర్కొన్నారు. వారి ఆదాయం 20-30% పెరిగేలా చేశారని తెలిపారు. 2018లో అనకాపల్లిలో నెలకొల్పిన ఈ సంస్థ ఆదాయం 2023-24లో ₹1cr+కి చేరింది.
News February 19, 2025
వరంగల్: చిరుదాన్యాలు, ఉత్పత్తుల ధరలు ఇలా

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వివిధ రకాల ఉత్పత్తులు, చిరుదాన్యాలు తరలిరాగా.. ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11వేలు పలకగా, దీపిక మిర్చి రూ.16,000, అకిరా బ్యాగడి రూ.11వేల ధర పలికాయి. అలాగే 2043 రకం మిర్చి రూ.14వేలు, ఎల్లో మిర్చికి రూ.17,000, సూక పల్లికాయకి రూ.6820, పచ్చి పల్లికాయకి రూ.5వేల ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.