News January 28, 2025
NZB జిల్లాలో దారుణం.. కన్న తల్లిని చంపాడు

కన్నతల్లిని చెరువులో ముంచి చంపిన ఘటన పోతంగల్ మండలం జల్లపల్లి ఫారంలో ఆలస్యంగా వెలుగు చూసింది. కోటగిరి ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం. నేనావత్ రాములు తన తల్లి నేనావత్ మంగిలి బాయి(70)ని ఆభరణాల కోసం ఈ నెల 26వ తేదీన స్థానిక చెరువులో ముంచి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారించడంతో నేరాన్ని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మంగళవారం వివరించారు.
Similar News
News September 17, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ పోటీ

త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేషనల్ కో-ఆర్డినేటర్ ఎస్ మోహన్ రావు తెలిపారు. మంగళవారం బషీర్బాగ్లో పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత జెన్ని మహంతి శ్రీనివాస్ పోటీ చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అవినీతి లేని సమాజ నిర్మాణమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.
News September 17, 2025
RGM: సింగరేణి S & PCఅధికారులతో సమావేశం

RGM సింగరేణి సంస్థ GM ఆఫీస్ లో RG-1, 2, 3, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల S&PC డిపార్ట్మెంట్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా GM సెక్యూరిటీ లక్ష్మీనారాయణ, GM లలిత్ కుమార్ పాల్గొని మాట్లాడారు. సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహించే సమయంలో వినియోగాన్ని తగ్గించాలన్నారు. దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు వీరారెడ్డి, షరీఫ్, షబీరుద్దీన్ ఉన్నారు.
News September 17, 2025
Way2News కథనానికి స్పందన.. బంధువుల వద్దకు చేరిన బామ్మ

బాపట్లలో Way2News కథనానికి కొన్ని నిమిషాల్లోనే స్పందన లభించింది. ఓ వృద్ధురాలిని బైక్పై తీసుకొచ్చి నడిరోడ్డుపై విడిచిపెట్టి వెళ్లిన ఘటన మంగళవారం బాపట్లలో వెలుగు చూసింది. బైక్పై తీసుకొచ్చి.. బజారులో వదిలేశారు శీర్షికన Way2News కథనాన్ని ప్రచురించింది. స్పందించిన కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. దీంతో వృద్ధురాలు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.