News January 28, 2025
NZB జిల్లాలో దారుణం.. కన్న తల్లిని చంపాడు

కన్నతల్లిని చెరువులో ముంచి చంపిన ఘటన పోతంగల్ మండలం జల్లపల్లి ఫారంలో ఆలస్యంగా వెలుగు చూసింది. కోటగిరి ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం. నేనావత్ రాములు తన తల్లి నేనావత్ మంగిలి బాయి(70)ని ఆభరణాల కోసం ఈ నెల 26వ తేదీన స్థానిక చెరువులో ముంచి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారించడంతో నేరాన్ని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మంగళవారం వివరించారు.
Similar News
News February 9, 2025
గ్రేట్.. చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ

HYD నార్సింగిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డా.భూమిక (కర్నూలు) చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయ్యారు. దీంతో జీవన్‌దాన్, అవయవ దానం కోసం వారి కుటుంబసభ్యులను సంప్రదించగా.. తీవ్రమైన దుఃఖంలోనూ వారు అంగీకరించారు. దీంతో భూమిక గుండె, లివర్, రెండు కిడ్నీలు, ఊపిరితిత్తులను ఇతర వ్యక్తులకు అమర్చారు. మరణంలోనూ డాక్టరమ్మ తన వృత్తిధర్మాన్ని నిర్వర్తించారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
News February 9, 2025
భద్రాద్రి: తల్లి మందలించిందని కుమారుడి ఆత్మహత్య

తల్లి బైక్ కొనివ్వలేదని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు వివరాలిలా.. అశ్వారావుపేట ఫైర్ కాలనీకి చెందిన చీకటి స్వామి(20) గత కొన్ని రోజులుగా బులెట్ బైక్ కొనివ్వాలని తల్లిని అడుగుతున్నాడు. ఈరోజు ఖర్చులకు డబ్బులు అడిగాడు. తల్లి ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది, క్షణికావేశంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
News February 9, 2025
కడప: 36 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

కడప జిల్లా సిద్దవటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1987 – 88 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక జరిగింది. అప్పటి ఉపాధ్యాయులను వారు శాలువులతో ఘనంగా సత్కరించారు. గతంలో పాఠశాలలో తాము గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అందరము కలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇలా మీ బ్యాచ్‌తో మీరు కలిశారా?.