News January 12, 2025

NZB: జిల్లాలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత

image

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 12 గంటలకు నిజామాబాద్‌లో జరిగే ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను కవిత ప్రారంభిస్తారు. అనంతరం ఒంటి గంటకు తబ్లిగీ జమాత్ వేదిక సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు వర్ని బడాపహాడ్ దర్గాను దర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తలలో సమావేశమై, పలు అంశాలపై చర్చిస్తారు.

Similar News

News October 22, 2025

NZB: ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్

image

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి ఉన్నారు.

News October 22, 2025

కొమురం భీం పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం: ఎమ్మెల్సీ కవిత

image

కొమురం భీం నినాదం, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అంటూ X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

News October 22, 2025

NZB: అన్నదాతలను కాంగ్రెస్ అరిగోస పెడుతోంది: కవిత

image

కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసిన పాపానికి అన్నదాతలను అరిగోస పెడోతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులే ఏకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకన్నా రూ.400 తక్కువకు కొనుగోలు చేస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని ట్వీట్ చేశారు.