News June 7, 2024

NZB జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి

image

ఆలూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కూలర్ షాక్ కొట్టి సింధూర(5) మృతి చెందింది. నిజామాబాద్‌కి చెందిన సౌందర్య, మనీశ్ దంపతుల కూతురు సింధూర ఆలూరులోని అమ్మమ్మ ఇంట్లో శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ కూలర్‌ను తాకింది. కూలర్ అన్ చేసి ఉండటంతో షాక్ కొట్టి చిన్నారి తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Similar News

News November 23, 2025

త్వరలో జిల్లా అంతటా పర్యటిస్తా: జీవన్ రెడ్డి

image

త్వరలో నిజామాబాద్ జిల్లా అంతటా పర్యటించి,స్థానిక పోరుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తానని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆపద కాలంలో పార్టీ కోసం పోరాడుతున్న గులాబీ శ్రేణులకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను గ్రామగ్రామాన ఎండగడతామని అన్నారు.

News November 23, 2025

నిజామాబాద్ జిల్లా నుంచే కాంగ్రెస్ పతనం: జీవన్ రెడ్డి

image

నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోట అని, కాంగ్రెస్ పతనాన్ని నిజామాబాద్ గడ్డ నుంచే శాసిస్తామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి చేసేవరకు నిద్రబోమన్నారు. ఒంటరిగానే పోటీ చేసి వంద సీట్లతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసి డ్యూటీకెక్కుతామన్నారు.