News June 7, 2024

NZB జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి

image

ఆలూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కూలర్ షాక్ కొట్టి సింధూర(5) మృతి చెందింది. నిజామాబాద్‌కి చెందిన సౌందర్య, మనీశ్ దంపతుల కూతురు సింధూర ఆలూరులోని అమ్మమ్మ ఇంట్లో శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ కూలర్‌ను తాకింది. కూలర్ అన్ చేసి ఉండటంతో షాక్ కొట్టి చిన్నారి తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Similar News

News December 10, 2024

గ్రూప్-2 పరీక్ష పక్కడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్

image

గ్రూప్-2 పరీక్ష పక్కడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 19 కేంద్రాల్లో 8,085 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్ల ఆయన తెలిపారు.

News December 10, 2024

పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి

image

ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో టీపీటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఉపాధ్యాయులకు దాదాపుగా 9 నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు.

News December 10, 2024

NZB: జిల్లాలో 5053 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా

image

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డులు ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ 5053 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఇప్పటికే ఈ నెల 7 వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామని వివరించారు