News March 1, 2025
NZB: జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

నిజామాబాద్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. NZB రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్‌లో చండీ కృష్ణ (37) అనే వ్యవసాయ కూలీ ఫిట్స్‌తో మృతి చెందాడు. అలాగే రుద్రూర్ మండల కేంద్రంలో కాదారి సాయినాథ్ (38) అనే రైతు పొలం గట్టుపై నడుచుకుంటూ వెళ్తూ బురదలో పడి మృతి చెందాడు. అదేవిధంగా నగరంలోని పూసలగల్లీలో బద్దురి లక్ష్మణ్ (41) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News March 1, 2025
BREAKING: కాచిగూడ-నిజామాబాద్ డెమో రైలు రద్దు

కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే (77601/77602) డెమో రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించాలని ఆయన కోరారు.
News March 1, 2025
NZB: సదరం దరఖాస్తుదారులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకుని వైకల్య నిర్ధారణ కోసం హాజరయ్యే వారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ సేవలను సులభతరం చేస్తూ ఇటీవల కొత్తగా యూనిక్ డిజబిలిటీ ఐడీ పోర్టల్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యల గురించి సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ కలెక్టర్లు, డీఆర్డీవోలు, డీడబ్ల్యూఓలకు వీసీ ద్వారా సూచించారు.
News March 1, 2025
NZB: యాసంగిలో ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఎరువులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందన్నారు. గతేడాది రబీలో 63 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగించగా, ఈ సారి 77 వేల మెట్రిక్ టన్నులకు ఎరువుల డిమాండ్ పెరిగిందని వివరించారు.