News May 26, 2024

NZB జిల్లా ఆసుపత్రిలో కుళ్లిన భోజనం.!

image

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో వైద్యం కోసం వస్తున్న పేద ప్రజలకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని పలువురు ఆరోపించారు. రోగులకు, వారి కోసం వచ్చిన వారికి అందించే భోజనంలో పురుగులు ఉన్నట్లు, గుడ్లు పాడయిపోయాయని వాపోయారు. ప్రభుత్వాసుపత్రిలో భోజన ఏజెన్సీ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ రోగుల పట్ల శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News November 12, 2025

ఆర్మూర్: బ్రిడ్జి పనుల్లో జాప్యం.. దుమ్ము ధూళితో శ్వాసకోశ ఇక్కట్లు

image

ARMR- NZB వెళ్లే మార్గంలోని రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జిపై కంకర వేసి, నీరు కొట్టకపోవడం వల్ల భారీగా దుమ్ము, ధూళి పైకి లేస్తోంది. ఈ ధూళి కళ్లు, ముక్కులోకి చేరడం వల్ల వాహనదారులు, అడవి మామిడిపల్లి గ్రామస్థులు తీవ్రశ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వెంటనే రోడ్డుపై తారువేసే పనులను ప్రారంభించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News November 11, 2025

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: టీయూ విద్యార్థి సంఘాలు

image

తెలంగాణ యూనివర్సిటీలో 2012 లో జరిగిన నియామకాలు చెల్లవని ఇచ్చిన హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని NSUI,PDSU నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సమావేశంలో NSUI, వర్సిటీ మాజీ అధ్యక్షుడు శ్రీశైలం,PDSU నాయకులు అనిల్ కుమార్ మాట్లాడారు.తప్పుడు పత్రాలతో నియామకం అయిన వారిని తొలగించి,హైకోర్టు తీర్పును పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.నాయకులు రాజు, గోవింద్,మహేష్,అరుణ,పవిత్ర,నవీన్ తదితరులున్నారు.

News November 11, 2025

నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగ మేళా

image

నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 13న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చేసిన యువతి, యువకులు అర్హులని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు. వయస్సు18 నుంచి 30 లోపు వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని తెలిపారు.