News February 11, 2025
NZB: జిల్లా ఓటర్ల వివరాలు

నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 33 మండలాల్లో 48 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 31,574 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో 19,993 మంది పురుషులు, 11,581 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు వివరించారు.
Similar News
News October 30, 2025
నిజామాబాద్: పశు సంవర్ధక శాఖ సేవలు మెరుగు పరచాలి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉంటూ పశు సంవర్ధక శాఖ సేవలను మరింతగా మెరుగుపర్చాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా కార్యాలయం మినీ కాన్ఫరెన్సు హాల్‌లో ఆయన పశు సంవర్ధక శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పశు సంపద కలిగిన రైతులకు అవసరమైన సేవలు అందించేలా పశు వైద్యాధికారులు అందుబాటులో ఉండి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 29, 2025
NZB: నా వెనుక ఎవరూ లేరు: ఎమ్మెల్సీ కవిత

తాను ఇండిపెండెంట్ నని, తన వెనుక ఎవరు లేరని, తన ముందు ప్రజలు ఉన్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన వారిపై ఆరోపణలు, అనుమానాలు, అవమానాలు ఉంటాయన్నారు. తన నడక ద్వారా తన స్టాండ్ ఏంటో ప్రజలకు అర్థమవుతుందని, అందుకు కొంత సమయం పడుతుందన్నారు. తాను ఒక పని పెట్టుకుంటే ఆ కమిట్ మెంట్ ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుందని స్పష్టం చేశారు.
News October 29, 2025
నిజామాబాద్: NOV 1వరకు గడువు: కలెక్టర్

అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్- 2047 అంశాలతో డాక్యుమెంటును రూపొందిస్తుందని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సర్వేలో అందరూ భాగస్వాములు కావాలని బుధవారం ఆయన ప్రకటనలో కోరారు. సర్వేలో పాల్గొనేందుకు NOV 1వరకు గడువుందని చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, భవిష్యత్ నిర్మాణంలో తమవంతు కృషి చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


