News June 12, 2024

NZB జిల్లా నుంచి వరంగల్‌కి డీలక్స్ బస్‌లు

image

నిజమాబాద్ జిల్లా ప్రజలకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్తగా డీలక్స్ బస్‌లను అందుబాటులోకి తెచ్చింది. నిజమాబాద్ నుంచి వరంగల్‌కు ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ అధికారులు డీలక్స్ బస్‌లను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం నుంచి డీలక్స్ బస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

Similar News

News March 24, 2025

పోతంగల్ : అగ్నిప్రమాదం.. ఇంట్లో వస్తువులన్నీ దగ్ధం

image

పోతంగల్ మండలం కల్లూరుగ్రామంలో అగ్నిప్రమాదం సంభవించి రేకుల ఇల్లు పూర్తిగా దగ్ధమై రూ.2లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన బీర్కూర్ భారతి, గంగారాంలు సోమవారం ఉదయం ఇంటిలో పూజా కార్యక్రమాలు ముగించుకొని కూలి పనికి వెళ్లారు. దేవుడి చిత్రపటాల వద్ద వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు కింద పడడంతో మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది.

News March 24, 2025

నిజామాబాద్: మళ్లీ పెరిగిన ఎండ తీవ్రత

image

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత మళ్లీ పెరిగింది. ఉదయం పూట చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది. ఆదివారం కోటగిరి మండల కేంద్రంలో 41℃ ఉష్ణోగ్రత, ముగ్పాల్ మండలంలోని మంచిప్పలో 40.6, కమ్మర్పల్లి, మెండోరా మండల కేంద్రంలో 40.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది.

News March 24, 2025

సాలూర: చెరువులో పడి యువకుడు మృతి

image

సాలూర మండలం జాడి జమాల్పూర్ గ్రామానికి చెందిన మోతేవార్ రమేశ్(26) చెరువులో పడి మృతి చెందాడు. బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డ వివరాలు.. రమేశ్ పొలానికి వెళ్లి తిరిగి ఇంటికెళ్తుండగా మార్గమధ్యంలో కాలకృత్యాలు చేసుకొని స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మృతుడి తండ్రి నాగనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.

error: Content is protected !!