News March 29, 2025

NZB: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీపీ

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య పోలీస్ శాఖ తరఫున విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజలందరూ ఎలాంటి అభద్రతాభావంతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ప్రజలు శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

Similar News

News April 25, 2025

నిజామాబాద్ జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లా జడ్జిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జిల్లా న్యాయమూర్తి జి.వి.ఎన్.భరతలక్ష్మిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనంలోని జిల్లా జడ్జి ఛాంబర్లో ఆమెకు పూల మొక్కను అందించి స్వాగతం తెలిపారు. ఇరువురు కొద్దిసేపు భేటీ అయ్యి జిల్లా స్థితిగతులపై చర్చించారు.

News April 25, 2025

KMR: ప్రైవేటు వీడియోలు ఉన్నాయంటూ MLAకు బెదిరింపులు

image

జుక్కల్ MLA తోట లక్ష్మి కాంత్ రావును బ్లాక్‌ మెయిల్ చేసిన ఓ రిపోర్టర్‌ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. MLAకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని.. రూ.5 కోట్లు ఇవ్వకుంటే వాటిని బయటపెడతానని ఓ మహిళతో కలిసి శ్యామ్ అనే రిపోర్టర్ బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడినట్లు MLA ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి శ్యామ్‌ను అరెస్ట్ చేసి ఉప్పర్‌పల్లి మెట్రోపాలిటన్ కోర్టులో హాజరు పరిచారు.

News April 25, 2025

నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

image

నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గురువారం ఆర్మూర్‌లో 45.4, ముగ్పాల్ 45.3, ముప్కాల్, ఎడపల్లి, ఏర్గట్ల 45.1, మెండోరా, నిజామాబాద్ పట్టణం, కమ్మర్పల్లి, మోస్రా 45.0, ధర్పల్లి, కోటగిరి 44.9, ఆలూర్ 44.8, నందిపేట, నిజామాబాద్ రూరల్, సిరికొండ 44.7, మోర్తాడ్ 44.6, తుంపల్లి 44.5, మక్లూర్ 44.4, బోధన్, జనకంపేట, రెంజల్ 44.2, డొంకేశ్వర్, బాల్కొండ 44.1, సాలూరా 44, భీంగల్లో 43.9℃ ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!