News March 25, 2024

NZB జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్క చోట చేర్చే ఈ హోలీ వేడుక ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీ వేడుక జరుపుకోవాలన్నారు.

Similar News

News March 10, 2026

NZB: ఇంటర్ పరీక్షలు.. 377 మంది గైర్హాజరు

image

NZB జిల్లాలోని 58 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం భౌతికశాస్త్రం, అర్ధ శాస్త్రం, ఒకేషనల్ పరీక్షలకు 377 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DIEO రవికుమార్ తెలిపారు. మొత్తం 16,678 మంది విద్యార్థులకు గాను 16,301 మంది హాజరయ్యారన్నారు. జనరల్‌లో 14,305మంది విద్యార్థులకు గాను 13,997 మంది విద్యార్థులు, ఒకేషనల్‌లో 2,373 మంది విద్యార్థులకు గాను 2,304 మంది పరీక్షలు రాశారు.

News March 10, 2026

NZB: తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యం

image

కోటగిరి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి(27) తన ఇద్దరు పిల్లలతో కలిసి రెండు రోజుల క్రితం అదృశ్యమైంది. స్థానికంగా, బంధువుల వద్ద వెతికినా వారి ఆచూకీ లభించలేదని భర్త గంగాధర్ పేర్కొన్నారు. అలాగే కొత్తపల్లి గ్రామానికి చెందిన పుప్పాల సాయిలు(27) హోటల్‌కు వెళ్తానని చెప్పి కనిపించకుండా పోయారు. ఇరువురి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై సునీల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 10, 2026

నిజామాబాద్: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బూరుడుగల్లీలో సతీష్ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లారెడ్డిలో ఇల్లరికం ఉన్న సతీష్, భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఇటీవల నగరానికి తిరిగి వచ్చి పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. 2వ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.