News February 4, 2025
NZB: జిల్లా బృందానికి సిల్వర్ మెడల్
జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో భాగంగా 4*100 మీటర్ల రిలేలో నిజామాబాద్ జిల్లా అథ్లెట్లు సిల్వర్ మెడల్ సాధించారు. కేరళ రాష్ట్రంలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో భాగంగా జిల్లాకు చెందిన గోపి, దినేష్, ఉత్తమ్‌తో పాటు ఇది వరకు నిజామాబాద్‌లో ఎస్హెచ్ఓగా పని చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ఇందులో పాల్గొన్నారు. అద్భుత ప్రతిభను ప్రదర్శించి సిల్వర్ మెడల్ సాధించారు.
Similar News
News February 4, 2025
కేంద్ర మంత్రులను కలిసిన బీజేపీ NZB అధ్యక్షుడు
బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన దినేష్ కులచారి మంగళవారం కేంద్ర మంత్రులను మర్యాద పూర్వకంగా కలిశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను ఢిల్లీలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయనకు కులచారికి సూచించారు.
News February 4, 2025
ఆర్మూర్: మెరుగైన వైద్య సేవలందించాలి: DMHO
నిజామాబాద్ జిల్లా DMHO రాజశ్రీ మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఆసుపత్రి రిజిస్టర్లను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే వైద్య సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఫాతిమా ఫిర్దోస్, డాక్టర్ ప్రవీణ్, ఆనంద్, LT కృష్ణ, ఫార్మసిస్టు సురేశ్, తదితరులు ఉన్నారు.
News February 4, 2025
NZB: రైతును బురిడీ కొట్టించి నగదు స్వాహా
రైతును బురిడీ కొట్టించి ఓ కేటుగాడు ATM కార్డు ద్వారా నగదు స్వాహా చేసిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. మోపాల్ మండలానికి చెందిన గంగారెడ్డి అనే రైతు రెండు రోజుల కిందట నిజామాబాద్‌లోని ఓ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్లి అక్కడ ఉన్న ఓ వ్యక్తి సహాయంతో రూ.5 వేలు డ్రా చేశాడు. ఈ సమయంలో ఆ కేటుగాడు వేరే కార్డు ఇచ్చి రైతును మోసం చేసి అనంతరం రూ.30 వేలు డ్రా చేశాడు. మేసేజ్‌లు రావడంతో రైతు పోలీసులను ఆశ్రయించారు.