News February 4, 2025
NZB: జిల్లా వాసికి సిల్వర్ మోడల్

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ స్టేట్ మీట్లో భాగంగా షాట్‌పుట్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ నీతా రెడ్డిని ఖైరతాబాద్ సీఐడీ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్ అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నీతా రెడ్డి హైదరాబాదులోని ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కరీంనగర్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మెడల్ సాధించడంతో ఆమెను ప్రశంసించారు.
Similar News
News December 24, 2025
నకిలీ నోట్ల కేసులో 8 మంది అరెస్ట్: వర్ని SI

వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామం కేంద్రంగా బయటపడ్డ దొంగ నోట్ల కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు వర్నిSI రాజు తెలిపారు. జలాల్పూర్ సర్పంచ్ మమత భర్త బాలుతో పాటు అతని తమ్ముడు నరేడ్ల శంకర్, అఫంధి ఫారానికి చెందిన పాల్త్య కళ్యాణ్, చందూర్ గ్రామానికి చెందిన సటోజీ గోపాల్, రమేష్, మహాదేవ్, ఇల్తేమ్ రవి, రవికుమార్ రెడ్డిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 9.86 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
News December 24, 2025
NZB: క్షణికావేశంతో ఉరివేసుకొని SUICIDE

జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో క్షణికావేశంతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. బాలనగర్ గ్రామానికి చెందిన మాగేమ్ సాయిలు మద్యం తాగి ఇంటికి వెళ్లి భార్యతో గొడవ పడి బయటకు వెళ్లాడు. అతని ఆచూకీ కోసం కోసం వెతుకుతుండగా గ్రామ శివారులోని దేవుని గుట్ట వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నా
News December 24, 2025
నిజామాబాద్: పలువురు సబ్ స్పెక్టర్ల బదిలీ

NZB పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న సబ్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. NZB వీఆర్ లో ఉన్న శ్రీనివాస్‌ను ధర్పల్లి SHOగా, అక్కడ ఉన్న కళ్యాణిని వీఆర్‌కు, వీఆర్‌లో ఉన్న జీ. వంశీ కృష్ణను వర్ని, వర్నిలో ఉన్న మహేశ్ వీఆర్‌కు, నవీపేట్ అటాచ్డ్ ఎస్సైగా ఉన్న తిరుపతిని భీమ్గల్౨కు, భీంగల్ ఎస్సై సందీప్‌ను 4వ టౌన్‌కు బదిలీ చేశారు.


