News July 2, 2024

NZB: జులై 4న విద్యాసంస్థల బంద్: PDSU

image

ఈ నెల 4న కేజీ టు పీజీ వరకు విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని NSUI, SFI, AISF, PDSU, AIPSU నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్‌లో PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, SFI జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేశ్ మాట్లాడుతూ.. జులై 4 న జరిగే దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు ప్రైవేట్ యాజమాన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News October 23, 2025

సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలి: కవిత

image

తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష నియామకాల్లో టీజీపీఎస్సీ… రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆర్టికల్ 371-డి ని ఉల్లంఘించిందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోని విచారించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌కు ఆమె లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం చేసిందన్నారు.

News October 23, 2025

రాష్ట్రస్థాయి పోటీల్లో NZB క్రీడాకారులకు మెడల్స్

image

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన అండర్ 19 రెజ్లింగ్ పోటీల్లో NZB క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2 గోల్డ్ మెడల్స్ 3 రజత పథకాలు సాధించారని కోచ్ సంతోష్ తెలిపారు. సఫీయా 76kg విభాగంలో కృష్ణ 65KG విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారన్నారు. మెడల్స్ సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.

News October 23, 2025

NZB: దివ్యాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి

image

దివ్యాంగ విద్యార్థులు స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ అధికారిణి రసూల్ బీ తెలిపారు. 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రీ మెట్రిక్, ఇంటర్ లేదా ఆపై చదువుతున్న వారికి పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ జాతీయ స్థాయిలో మంజూరు చేస్తామన్నారు. ఇందుకోసం www.scholarships.gov.in వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.