News March 15, 2025
NZB: జేఎల్గా ధరణీ శంకర్

రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూనియర్ లెక్చరర్ల నియామక పత్రాలను అందజేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లా వాజిద్ నగర్ గ్రామానికి చెందిన ధరణి శంకర్ బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా నియామకం పొందాడు. ఈ సందర్భంగా ఆయనను గ్రామస్థులు, ప్రిన్సిపల్ అభినందించారు.
Similar News
News October 13, 2025
ప్రజావాణికి 88 ఫిర్యాదులు: NZB అదనపు కలెక్టర్

నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 88 ఫిర్యాదులు వచ్చాయని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్తో పాటు డీఆర్డీఓ సాయాగౌడ్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు అందజేశారు.
News October 13, 2025
SRSP UPDATE: 8 గేట్ల ద్వారా నీటి విడుదల

SRSP నుంచి సోమవారం 9 గంటలకు 8 వరద గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడిచిపెట్టినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 84,790 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లోగా 84,790 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.501 TMCలకు గాను తాజాగా పూర్తిగా 80.501TMC ల నీరు నిల్వ ఉందని వివరించారు.
News October 13, 2025
ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు: ఆర్మూర్ ఎమ్మెల్యే

దీపావళి పండగకు టపాసుల దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా చలాన్లు కట్టి దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.