News October 12, 2024

NZB: టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి పై బదిలీ వేటు

image

నిజమాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తిపై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొద్ది నెలల క్రితమే నిజామాబాద్ కు టాస్క్ ఫోర్స్ ఏసీపీగా వచ్చిన విష్ణుమూర్తి అనతి కాలంలోనే అవినీతి ముద్ర వేసుకున్నారు. ఆయన తీరు వివాదాస్పదంగా మారి ఆయనపై సెటిల్ మెంట్లు, బెదిరింపులు, మామూళ్ల వసూళ్ల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

Similar News

News December 22, 2024

కామారెడ్డి: ఫలితాలు విడుదల

image

శనివారం నిర్వహించిన కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. స్టెనో 14, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ 42, రికార్డ్ అసిస్టెంట్  పరీక్షకు 78 మంది పరీక్షలకు హాజరయ్యారు. 40% మార్కులు పొందిన అభ్యర్థులను స్కిల్ టెస్ట్, ఓరల్ ఇంటర్వ్యూలకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపల్ జడ్జ్ వరప్రసాద్ తెలిపారు. 2వ స్టేజి పరీక్షలు ఈ నెల 28న జరుగుతాయని ఫలితాలకు కోర్టు వెబ్సైట్ చూడాలని సూచించారు.

News December 22, 2024

NZB: బేస్‌బాల్ ఛాంపియన్‌గా జిల్లా మహిళా జట్టు

image

నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు బేస్‌బాల్ ఛాంపియన్‌ షిప్‌ను కైవసం చేసుకుంది. సీఎం కప్ 2024 క్రీడా పోటీల్లో భాగంగా హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ బేస్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని 23 జిల్లాలు పాల్గొనగా ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుతో నిజామాబాద్ జిల్లా జట్టు తలపడింది. ఇందులో 3-6 పరుగుల తేడాతో నిజామాబాద్ జట్టు విజయకేతనం ఎగురవేసింది.

News December 21, 2024

నిజామాబాద్: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శనివారం సాయంత్రం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదివారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లపై ఎమ్మెల్యే, కలెక్టర్ ఆసుపత్రిలో వివిధ విభాగాల అధికారులతో మాట్లాడారు.