News November 16, 2024
NZB: టిప్పర్ ఢీకొని తండ్రీ కొడుకుకు గాయాలు

నిజామాబాద్ నగరంలోని రాజా రాజేంద్ర చౌరస్తాలో శనివారం టిప్పర్, బైక్ ఢీకొన్న ఘటనలో తండ్రీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామానికి చెందిన భూమారావ్, అతని కుమారుడు ధనుష్ పెద్ద బజార్ నుంచి న్యాల్ కల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పులాంగ్ చౌరస్తా నుంచి వర్నీ చౌరస్తా వైపు వెళ్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. దీనితో తండ్రీకొడుకులకు గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 28, 2026
నవీపేట్: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.