News February 12, 2025

NZB: టిప్పర్ సీజ్

image

నిజామాబాద్‌లో అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్‌ను సీజ్ చేసినట్లు ఐదో టౌన్ ఎస్ఐ గంగాధర్ తెలిపారు. టౌన్ పరిధిలో అక్రమంగా మొరం తరలిస్తుండగా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ చిన్న కొండయ్య, యజమాని నర్సయ్యపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ వెల్లడించారు. గతంలో మొరం అక్రమ రవాణా చేసిన పలువురిని తహశీల్దార్ ఎదుట హాజరుపరచగా రూ.5 లక్షల పూచీకత్తుపై సంవత్సరం వరకు బైండోవర్ విధించినట్లు ఎస్ఐ వివరించారు.

Similar News

News October 17, 2025

నిజామాబాద్: జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో విజ్ఞాన యాత్ర

image

పసుపు రైతుల నైపుణ్యాల అభివృద్ధి కోసం జిల్లా కేంద్రంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో విజ్ఞాన యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పసుపు రైతులకు కొత్త అవకాశాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగించే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

News October 17, 2025

నిజామాబాద్: రేపటి బంద్‌కు సంపూర్ణ మద్దతు: ఎమ్మెల్సీ కవిత

image

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టే బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్‌లో పాల్గొంటోందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్టు భావించాలా అన్నారు. కేంద్రంపై కొట్లాడకుండా ఉత్తుత్తి జీవో ఇచ్చిన కాంగ్రెస్ బంద్‌లో పాల్గొనడం హాస్యాస్పదమని ట్వీట్ చేశారు.

News October 17, 2025

NZB: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

నిజమాబాద్‌లో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో పెట్రోల్ నిర్వహిస్తుండగా పెంబోలి రైల్వే ట్రాక్ వద్ద ఓ వ్యక్తి పోలీసులు చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడి నుంచి 110 గ్రాముల గంజాయి స్వాదినపరుచుకుని రిమాండ్‌కు తరలించమన్నారు.