News February 16, 2025
NZB: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

NZB, ADB, KNR, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా భావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Similar News
News March 9, 2026
NZB: మినీ సరస్ మేళాను సందర్శించిన డీఎంహెచ్‌ఓ

నిజామాబాద్‌లో నిర్వహిస్తున్న ‘మినీ సరస్ మేళా-2026’ను జిల్లా ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డా.బి.రాజశ్రీ సందర్శించారు. గ్రామీణ చేతివృత్తి కళాకారులు, స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె ఆసక్తిగా తిలకించారు. హస్తకళ నైపుణ్యంతో తయారైన వస్తువులను పరిశీలించారు. ఈ ప్రదర్శన ఎంతో ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా గ్రామీణ సంస్కృతిపై అవగాహన కల్పించేలా ఉందని ఆమె కొనియాడారు.
News March 8, 2026
NZB: పెరిగిన గ్యాస్ ధరలు.. జిల్లా ప్రజలపై రూ.కోటి భారం

పెరిగిన వంట గ్యాస్ సిలెండర్ల రేటుతో నిజామాబాద్ జిల్లా ప్రజలపై రూ.కోటి వరకు భారం పడనుంది. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 42 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రతినెలా సగటున 1.50 లక్షల వరకు సిలిండర్ల వినియోగం అవుతున్నట్లు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో గృహ వినియోగ సిలెండర్‌పై రూ.60 పెరగడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భారం కానుంది.
News March 8, 2026
నిజామాబాద్ జిల్లాలో ‘అతివలదే’ అధికారం

NZB జిల్లా ప్రగతి పథానికి మహిళా అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ప్రధాన జడ్జీగా భరత లక్ష్మీ, DMHOగా డా.రాజశ్రీ, జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారిగా రసూల్ బీ, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిగా పద్మశ్రీ, RTC RMగా జ్యోత్స్న జిల్లా పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. వీరే కాకుండా పలు శాఖల్లో అధికారులుగా మహిళలు రాణిస్తున్నారు.
# అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


