News April 1, 2025
NZB: టీపీసీసీ అధ్యక్షుడికి బ్లాక్ బెల్ట్

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్కు కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 ప్రధానం చేశారు. ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమి నుంచి సర్టిఫికేట్ అందుకున్నారు. హైదరాబాదులోని YWCAలో 3 గంటల పాటు జరిగిన పరీక్షలో మహేశ్ కుమార్ గౌడ్ నెగ్గారు. ఈ సందర్భంగా ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమి నుంచి బ్లాక్ బెల్ట్ 7వ డాన్ గ్రాండ్ మాస్టర్ ఎస్.శ్రీనివాసన్ అందజేశారు.
Similar News
News January 9, 2026
టీయూ పరిధిలో పీజీ పరీక్షలు వాయిదా

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 16 నుంచి జరగాల్సిన పీజీ ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంకాం/ఎమ్మెస్ డబ్ల్యూ/ఎంబీఏ/ఎంసీఏ/ఐఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
News January 9, 2026
NZB: కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసిన ఎంపీ అరవింద్

నిజామాబాద్ కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లో జరిగిన ఈ భేటీలో జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులపై వారు చర్చించారు. నూతన కలెక్టర్కు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
News January 8, 2026
నిజామాబాద్: PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జన్నారపు రాజేశ్వర్

PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా NZBకు చెందిన జన్నారపు రాజేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్లో 3 రోజుల పాటు నిర్వహించిన PDSU 23వ రాష్ట్ర మహాసభల్లో ఆయన్ను ఎన్నుకున్నారు. జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యా వ్యతిరేక విధానాలపై, విద్యా రంగ సమస్యలపై విద్యార్థి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామన్నారు. స్థానిక సమస్యలపై నిరంతరం పోరాడుతనని పేర్కొన్నారు.


