News April 24, 2024
NZB: టెట్‌కు తగ్గిన ఆదరణ

టెట్‌కు దరఖాస్తులు తగ్గాయి. ఈసారి ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు అనాసక్తి చూపుతున్నారు. గతేడాది నిర్వహించిన పరీక్షలో చాలా తక్కువ మంది ఉత్తీర్ణత సాధించడంతో టెట్ అప్లయ్ చేసుకునేందుకు విముఖత చూపుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పేపర్-1 4327, పేపర్-2 9045 మంది అప్లయ్ చేసుకున్నారు. కామారెడ్డిలో పేపర్-1కు 3773, పేపర్-2కు 4440 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News February 9, 2026
NZB: సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి: సీపీ

మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కును వినియోగించుకునేలా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీపీ సాయి చైతన్య సూచించారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో సీపీ సోమవారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పటిష్ట బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. అదనపు డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి, ఏసీపీ ప్రకాశ్ పాల్గొన్నారు.
News February 9, 2026
NZB: ప్రచార ముగింపుతో పోల్ మేనేజ్మెంట్ వ్యూహాలు

నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్ వరకు గడిచే రెండు రోజులు కీలకంగా మారనున్నాయి. చివరి నిమిషం వరకు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్‌పై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు పంపిణీపై చర్చ సాగుతోంది.
News February 9, 2026
NZB: 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపవచ్చు: కలెక్టర్

ఈ నెల 11న జరగనున్న NZB, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దాన్ని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి సూచించారు. ఓటర్ కార్డు, ఆధార్, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫోటోతో కూడిన పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఇలా మొత్తం 18 రకాల గుర్తింపు కార్డులు తమ వెంట తీసుకెళ్లవచ్చన్నారు.


