News May 18, 2024
NZB: టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో..!
టెట్ అభ్యర్థులకు ఈసారి కష్టాలు తప్పడం లేదు. దరఖాస్తుల సమయంలో రుసుము రూ.400 నుంచి 1000 పెంచగా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే పరీక్షా కేంద్రాల కేటాయింపులో సైతం సొంత జిల్లాలో కాకుండా దూరపు ప్రాంతాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుకు రూ.1000 తీసుకొని దూరపు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 11, 2024
NZB: చర్చనీయాంశంగా మారిన ఫ్లెక్సీలు
నిజామాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ‘జిల్లాలో పర్యాటక రంగంపై రెడ్ టేపిజం అని, కొంతమంది అధికారుల చేతుల్లో చిక్కిన పర్యాటకరంగం.. త్వరలో అన్ని అధారాలతో మీ ముందుకు’ అని పలు చౌరస్తాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా ప్రస్తుతం పట్టణంలో ఇవి ఎవరు పెట్టారు? కారణమేంటని పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
News December 11, 2024
NZB: UPDATE.. ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
జక్రాన్‌పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతి చెందిన వారు నిజామాబాద్‌కు చెందిన కస్తూరి ప్రమోద్, అంకడి సంజయ్ గా గుర్తించినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఈ ఇద్దరు జక్రాన్ పల్లి నుంచి నిజామాబాద్ వైపు బైకుపై వెళ్తుండగా సికింద్రాపూర్ 44 జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారని వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.
News December 10, 2024
గ్రూప్-2 పరీక్ష పక్కడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్
గ్రూప్-2 పరీక్ష పక్కడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 19 కేంద్రాల్లో 8,085 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్ల ఆయన తెలిపారు.