News December 3, 2024

NZB: డిసెంబర్ 4 నుంచి జాగృతి ఉమ్మడి జిల్లాల సమావేశాలు

image

డిసెంబర్ 4 నుంచి తెలంగాణ జాగృతి ఉమ్మడి జిల్లా వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం జాగృతి నాయకులు షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన వరుసగా సమావేశాలు కొనసాగనున్నాయి. డిసెంబర్ 4న వరంగల్ మరియు, నిజామాబాద్ 5న కరీంనగర్ & నల్గొండ, 6న రంగారెడ్డి మరియు ఆదిలాబాద్, 7న హైదరాబాద్ మరియు ఖమ్మం, 8న మెదక్ మరియు మహబూబ్‌నగర్ లో జరగనున్నాయి

Similar News

News January 13, 2026

బోధన్ శివారులో డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రుద్ర వెంచర్ వద్ద ద్విచక్ర వాహనపై వెళ్తున్న లంగ్డ పూర్ పూర్ గ్రామానికి చెందిన అంజి (38)ని డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

NZB జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్

image

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో శుభాలు సమకూరాలని, అనుకున్న కార్యాలన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని అభిలషించారు.