News May 10, 2024
NZB: డీకంపల్లి పెద్దమ్మ గుడిలో దొంగల బీభత్సం

ఆలూర్ మండలం డికంపల్లి గ్రామ సమీపంలో ఉన్న పెద్దమ్మ గుడి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గుడి తాళాన్ని బద్దలు కొట్టి అమ్మవారి ముక్కుపుడక, బంగారు ఆభరణాలు, వెండి కన్నులు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 17, 2025
NZB: ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం

అక్టోబర్ 21 న పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆసక్తి గల విద్యార్థులు, యువత, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఎవరైనా సరే పోలీస్ సేవలు, త్యాగాలు, సమాజ రక్షణపై ఆధారంగా 3 ఫోటోలు లేదా 3 నిమిషాల షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కమీషనర్ సాయి చైతన్య ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 24లోపు కమీషనరేటు పోలీస్ కార్యాలయంలోని పోలీస్ పీఆర్వోకు అందజేయాలని తెలిపారు.
News October 16, 2025
సీపీఆర్తో ప్రాణాలను రక్షించవచ్చు: కలెక్టర్

గుండెపోటుకు గురైన వారికి సకాలంలో సీపీఆర్ (కార్డియోపల్మనరీ రీససిటేషన్) చేసి ప్రాణాలను రక్షించవచ్చని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో సీపీఆర్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో అకస్మాత్తుగా వచ్చే గుండెపోటుకు సీపీఆర్ ఎంతో ఉపయోగమన్నారు. ప్రతి ఒక్కరు దీనిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News October 16, 2025
నిజామాబాద్: ఈనెల 18న జిల్లావ్యాప్త బంద్

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంటులో చట్టం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి డిమాండ్ చేశారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం అడ్డు పడుతుందని ఆయన విమర్శించారు. ఈనెల 18న జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతం చేయాలని కోరారు.