News February 12, 2025
NZB: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 24 మందికి జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష, 24 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 26 మందికి ట్రాఫిక్ ఎస్ఐ చంద్రమోహన్ కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. 24 మందికి రూ.36,000 జరిమానా విధించి ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు.
Similar News
News February 22, 2026
NZB: రెండు వారాల్లో 134 DD కేసులు :CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 134 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 134 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ 12.10 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 13 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.
News February 22, 2026
NZB: NAC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

NAC ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీ యువత కోసం ల్యాండ్ సర్వేలో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తామని NZB అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి తెలిపారు. ఈ శిక్షణ ఈనెల 27 నుంచి ప్రారంభమవుతుందన్నారు. 18-35 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. ఇంటర్మీడియట్, లేదా ITI సివిల్ చదివినవారు అర్హులన్నారు. వీరికి స్టేషనరీ, యూనిఫామ్ ఉచితం అని, గ్యారెంటీ ప్లేస్మెంట్ కల్పిస్తామన్నారు.