News March 20, 2024

NZB: డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన ముగ్గురికి 2 రోజుల జైలు

image

మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ జడ్జి ఖదీర్ బుధవారం తీర్పునిచ్చారని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. పట్టణంలో మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 9 మంది పట్టుబడగా అందులో పఠాన్ షేర్ ఖాన్, సిర్నాపల్లి భూమేశ్, పెందోట రవి కుమార్‌లకు జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 15, 2026

NZB: ప్రత్యేక సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రత్యేక సమావేశ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. నూతన కార్పొరేటర్లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరవుతున్న నేపథ్యంలో, ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత, ప్రొటోకాల్ విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు.

News February 15, 2026

NZB: యథావిధిగా ప్రజావాణి

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని గుర్తు చేశారు.

News February 15, 2026

NZB: ఆ ఐదుగురిలో మేయర్ ఎవరో?

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి 17 మంది కార్పొరేటర్లు గెలువగా అందులో ఐదుగురు మహిళలున్నారు. వారిలో 21వ డివిజన్ నుంచి గెలుపొందిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్ ఉమారాణి, 12వ డివిజన్ దుమాలే అరుంధతి, 9వ డివిజన్ కేతావత్ సురేఖ, 41వ డివిజన్ పూజిత ప్రవీన్ గౌడ్‌లో ఒకరికి మేయర్ పదవి దక్కే అవకాశాలున్నాయి.