News March 14, 2025

NZB: తల్లిని హత్య చేసిన కూతురు

image

నిజామాబాద్ నగరంలోని నాగారం 300 క్వార్టర్స్‌ దారుణం చోటుచేసుకుంది. ఓ కూతురు తన భర్తతో కలిసి కన్న తల్లిని హత్య చేసింది. స్థానికుల కథనం ప్రకారం.. బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన విజయ(60) భర్త చనిపోగా కూతురు సౌందర్య, అల్లుడితో కలిసి ఉంటోంది. శుక్రవారం తన తల్లికి గుండెపోటు వచ్చి చనిపోయిందని సౌందర్య నమ్మించే ప్రయత్నం చేయగా విజయ గొంతుపై గాయాలు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Similar News

News January 7, 2026

నిజామాబాద్ అంగన్‌వాడీల్లో నియామకాల జాప్యం..!

image

నిజామాబాద్ జిల్లాలో అంగన్‌వాడీల్లో నియామకాల జాప్యం సాగుతోంది. జిల్లాలో 1,501 ప్రధాన కేంద్రాలతోపాటు 135 మినీ కేంద్రాలను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసినప్పటికీ, ఆయా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో 76 టీచర్, 400 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఖాళీలను భర్తీ చేయాలని అటు సిబ్బంది, ఇటు లబ్ధిదారులు కోరుతున్నారు.

News January 6, 2026

NZB: నేరాల నియంత్రణపై సీపీ సమీక్ష

image

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులతో సీపీ సాయి చైతన్య సమీక్ష నిర్వహించారు. CMR కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలపై నిఘా పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు, స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలన్నారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ డివిజన్లలోని పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించి, శాంతిభద్రతలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

News January 6, 2026

ఓటర్ జాబితా సవరణలో పారదర్శకత ఉండాలి: NZB కలెక్టర్

image

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. అర్బన్ పరిధిలోని 301 పోలింగ్ కేంద్రాల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా జాబితా రూపొందించాలన్నారు.