News March 5, 2025
NZB: తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు: చర్యలు

నిజామాబాద్ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ బుధవారం తాగునీటి సరఫరాపై సమీక్ష జరిపి మాట్లాడుతూ.. వేసవి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన జరపాలని సూచించారు. ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి ఎద్దడి రావద్దన్నారు.
Similar News
News March 26, 2025
బిక్కనూర్: పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాసిన అమ్మాయి

తండ్రి మృతి చెందినా దుఃఖాన్ని దిగమింగుతూ పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థినిని చూసి పలువురు కంటతడి పెట్టారు. బిక్కనూర్‌కు చెందిన సత్యం అనే వ్యక్తి బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుమార్తె కీర్తన పుట్టెడు దుఃఖంలో పదో తరగతి పరీక్ష రాసింది. కన్న తండ్రి చనిపోయినా బాధను దిగమింగి పరీక్షలు రాసిన విద్యార్థినిని తోటి విద్యార్థులు ఓదార్చారు. అంతటి బాధలో పరీక్ష రాసిన అమ్మాయి గ్రేట్ కదా.
News March 26, 2025
నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం మల్కాపూర్లో అత్యధికంగా 40.2℃ఉష్ణోగ్రత నమోదైంది. అటు నిజామాబాద్ పట్టణం, మంచిప్ప, కోటగిరిలో 40, మోస్రా 39.9, ధర్పల్లి, లక్మాపూర్ 39.8, యెడపల్లె, మెండోరా 39.7, ఎర్గట్ల, పెర్కిట్, మోర్తాడ్ 39.5, వేంపల్లి, వైల్‌పూర్ 39.3, సిరికొండ, ముప్కాల్, కమ్మర్పల్లి, తుంపల్లి 39.2, మాచర్ల, భీంగల్లో 39.1℃ఉష్ణోగ్రత నమోదైంది.
News March 26, 2025
బాన్సువాడ: పెళ్లైన నెలకే నవవధువు ఆత్మహత్య

బాన్సువాడ కొల్లూరులో లక్ష్మి, వెంకటేశ్‌లకు FEB 23న వివాహం జరిగింది. అయితే ఇష్టంలేని పెళ్లి చేయడంతోనే లక్ష్మి మంగళవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని సీఐ అశోక్ తెలిపారు. సూసైడ్ అటెంప్ట్ విషయాన్ని గమనించిన కుటుంబీకులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు బాన్సువాడ ఏరియా ఆసుపత్రి డాక్టర్ తెలిపారు. మృతురాలి తల్లి చంద్రకళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.