News December 12, 2024
NZB: తాగుబోతు ఎఫెక్ట్.. నిలిచిన ట్రాఫిక్
నిజామాబాద్ నీలకంఠేశ్వర దేవాలయం సమీపంలో ఓ తాగుబోతు బుధవారం రాత్రి హల్చల్ చేశాడు. అక్కడి ఓ వైన్స్ ఎదుట రోడ్డుకు అడ్డంగా కూర్చొని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాడు. దీంతో నిజామాబాద్- ఆర్మూర్ ప్రధాన రూట్ లో ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంబులెన్స్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకు పోయింది.
Similar News
News December 12, 2024
మెండోరా: ఏడాదిగా మూసి ఉన్న ATM
మెండోరా మండలం పోచంపాడ్ చౌరస్తాలోని SBI ATM ఏడాదిగా మూసిఉంది. 2023 SEPలో దొంగలు ATMలో చోరీ చేసి రూ.12లక్షలు ఎత్తుకెళ్లడంతో అప్పటినుంచి అది మూతపడి ఉంది. మండలం చుట్టుపక్కల ATMలు లేకపోవడంతో నగదు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో నిర్మల్ లేదా బాల్కొండ వెళ్లాల్సి వస్తోందని, అధికారులు స్పందించి దాన్ని ఓపెన్ చేయాలని కోరారు.
News December 12, 2024
బోధన్‌లో విద్యుత్తు అధికారుల పొలంబాట
బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లి ప్రాంతంలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ట్రాన్స్‌కో డీఈ ముక్త్యార్ హైమద్ మాట్లాడుతూ.. రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు తమ బోరు మోటార్లకు కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏడీఈ నాగేష్ కుమార్, ఏఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News December 11, 2024
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్
ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్ అన్నారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును ఆయన పరిశీలించారు.లబ్ధిదారుల భూముల వివరాలను పరిశీలించాలని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు.