News March 30, 2024
NZB: తాటి చెట్టు పైనుంచి పడి యువకుడి మృతి
తాటి చెట్టుపై నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన మక్కల శేఖర్(33) శనివారం గ్రామంలోని తాటి ముంజల కోసం చెట్టు ఎక్కి ప్రమాదవ శాత్తు కిందపడ్డాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి భార్య రాజ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వంశీకృష్ణ పేర్కొన్నారు.
Similar News
News January 20, 2025
NZB: నేడు జిల్లా స్థాయి అవార్డుల పంపిణీ: DEO
నిజామాబాద్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) అశోక్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని ఖలీల్వాడీలో ఉన్న న్యూ అంబేడ్కర్ భవన్‌లో ఈ అవార్డుల పంపిణీ ఉంటుందన్నారు. ఈ పంపిణీ గత సెప్టెంబర్‌లో జరపాల్సి ఉండగా వరదల కారణంగా వాయిదా పడిందన్నారు.
News January 20, 2025
NZB: 28 కేంద్రాలు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్నాయి: DGP
రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాలు భరోసా కేంద్రాలు లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలికలకు సేవలందిస్తున్నాయని DGP జితేందర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్‌లో 29వ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కాగా 2016 నుంచి 2024 డిసెంబర్ వరకు భరోసా కేంద్రాల ద్వారా పోక్సో వంటి కేసులు 6910, రేప్ కేసులు 1770, డొమెస్టిక్ వైలెన్స్ అండ్ అదర్స్ 11,663 కేసులు పరిష్కరించడం జరిగిందని వివరించారు.
News January 19, 2025
NZB: రూ.382.28 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నిజామాబాద్ నగరంలో రూ.382.28 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ తాగునీటి సమస్యను తీర్చడానికి అమృత పథకం రూ.217 కోట్లతో నీటి సరఫరా, భూగర్భ మురుగునీటి నిర్వహణకు రూ.162.81 కోట్లు, రూ.2.47 కోట్లతో నిర్మించనున్న స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణం కోసం ఆయన శంకుస్థాపన చేశారు.