News February 2, 2025
NZB: తెలంగాణ నెట్‌బాల్ కోచ్‌గా రమేశ్

ఉత్తరాఖాండ్‌లో ఈ నెల 3 నుంచి 15 వరకు 38వ జాతీయ క్రీడలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే తెలంగాణ నెట్‌బాల్ జట్టుకు శిక్షకుడిగా జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు రమేశ్ ఎంపికైనట్లు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తెలిపారు. రమేశ్ ప్రస్తుతం జన్నేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను డీఈవో అశోక్, ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగమణి, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు.
Similar News
News February 7, 2025
ఇది కదా సక్సెస్ అంటే.. రూ.40 లక్షల నుంచి రూ.20 కోట్లకు

‘పాతాల్ లోక్’ వెబ్ సిరీస్ పార్ట్ 2 అమెజాన్ ప్రైమ్‌లో అదరగొడుతోంది. ముఖ్యంగా హాథీరామ్ చౌదరి పాత్రలో జైదీప్ అహ్లావత్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. 2020లో రిలీజైన మొదటి పార్ట్‌కు కేవలం రూ.40లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న అతను ఇప్పుడు ఏకంగా రూ.20 కోట్లు అందుకున్నారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో సక్సెస్ అంటే ఇదేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News February 7, 2025
దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

ఏలూరులోని నగల దుకాణంలో భారీ చోరీకి పాల్పడిన<<15384948>> దొంగలను<<>> పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులు అంతర్‌రాష్ట్ర ముఠాగా గుర్తించిన పోలీసులు వారు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు తెలిసి అక్కడకు వెళ్లారు. వారి గ్రామాల సమీపంలో మాటు వేసి పట్టుకున్నారు. నిందితులపై ఏలూరు పరిధిలో దాదాపు 10 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు
News February 7, 2025
వైఎస్ జగన్ నివాసానికి చేరనున్న శైలజానాథ్

మాజీ పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ మరికొద్ది సేపట్లో వైసీపీలోకి చేరునున్నారు. తన అనుచరులతో కలిసి ఆయన ఇప్పటికే తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. ఆయనకు జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించనున్నారు. శైలజానాథ్‌తో పాటు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు.