News February 13, 2025
NZB: తొమ్మిదిన్నర తులాల బంగారం చోరీ

NZBలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సౌత్ CI సురేశ్ తెలిపారు. అర్సపల్లిలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా షేక్ ఆఫ్తాబ్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆటోనగర్లో తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేసి నగలను అమ్మేందుకు వెళ్తుండగా పట్టుకున్నట్లు CI తెలిపారు. నిందితుడు నుంచి తొమ్మిదిన్నర తులాల బంగారం, రూ.15 వేల నగదు, 2 వాచ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.
Similar News
News October 22, 2025
NZB: ‘తెలంగాణ రైజింగ్-2047’ సర్వేకు విశేష స్పందన

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పన కోసం ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్-2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సర్వేలో తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అన్ని వర్గాల పౌరులు పాల్గొని విలువైన సమాచారాన్ని అందజేస్తున్నారన్నారు. దేశ స్వాతంత్య్రానికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది.
News October 22, 2025
నిజామాబాద్: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం సాలంపాడ్ గ్రామంలోని క్యాంప్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతుల ధాన్యం కొనుగోలుకు వ్యవసాయ అధికారుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా అందించాలని, తూకం, మిల్లులకు తరలింపు సజావుగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు.
News October 21, 2025
NZB: కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బోధన్ మండలంలోని పెగడాపల్లి, సాలూర మండలం సాలెంపాడ్ క్యాంపుల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి కొనుగోళ్లను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.