News February 13, 2025

NZB: తొమ్మిదిన్నర తులాల బంగారం చోరీ

image

NZBలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సౌత్ CI సురేశ్ తెలిపారు. అర్సపల్లిలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా షేక్ ఆఫ్తాబ్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆటోనగర్‌లో తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేసి నగలను అమ్మేందుకు వెళ్తుండగా పట్టుకున్నట్లు CI తెలిపారు. నిందితుడు నుంచి తొమ్మిదిన్నర తులాల బంగారం, రూ.15 వేల నగదు, 2 వాచ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.

Similar News

News March 16, 2025

నిజామాబాద్: అనుమానాలను నివృత్తి చేయాలి: కవిత

image

గ్రూప్-1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ట్రాన్స్‌లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని అంటున్నారన్నారు. 

News March 16, 2025

బోధన్: షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన రాష్ట్ర మంత్రి

image

బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రైతులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు మహారాష్ట్రలోని సాంగ్లీ తాలూకాలో చెరుకు పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు శ్రీధర్ బాబు, మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, సాంగ్లీలోని శ్రీదత్త షుగర్ ఫ్యాక్టరీ ఛైర్మన్ శ్రీగణపతి రావు పాటిల్, నాయకులు పాల్గొన్నారు.  

News March 16, 2025

NZB: 40 డిగ్రీలకు చేరువలో ఎండ

image

నిజామాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం ఎండ 40 డిగ్రీలకు చేరువ చేరింది. దానికి తోడు వడ గాలులు కూడా వీస్తున్నాయి. దీనితో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన ప్రజలు వేడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. కాగా గత ఏడాది ఇదే రోజు 34 డిగ్రీలుగా ఎండ నమోదైంది.

error: Content is protected !!