News January 26, 2025
NZB: తొర్లికొండ ZPHS విద్యార్థి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

తొర్లికొండ ZPHS విద్యార్థి శ్రావ్య జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైంది. ఇటీవల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ అండర్-19లో జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఈ నెల 24 నుంచి 28 వరకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం శంభాజీ నగర్ (మహారాష్ట్ర)లో జరిగే 68వ జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ అండర్-19 పోటీల్లో పాల్గొననున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ గంగా మోహన్ తెలిపారు.
Similar News
News February 18, 2025
NZB: ఆరుగురి హత్య.. కోర్టు సంచలన తీర్పు

నిజామాబాద్ జిల్లాలో 2023లో సంచలనం రేపిన ఆరుగురి హత్య కేసులో జిల్లా కోర్డు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రశాంత్, అతని తల్లి వడ్డేమ్మకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తీర్పును వెలువరించారు. 2023లో మాక్లూర్ మండల కేంద్రంలో ప్రసాద్ కుటుంబానికి చెందిన ఆస్తిని అతని స్నేహితుడు ప్రశాంత్ కాజేసేందుకు కుట్ర చేశాడు. ఇందుకు ఆరుగురిని హత్య చేశాడు.
News February 18, 2025
NZB: రాష్ట్ర జూడో అసోసియేషన్‌లో జిల్లా వాసులు

తెలంగాణ రాష్ట్ర జూడో అసోసియేషన్‌లో నిజామాబాద్ జిల్లా బాధ్యులకు చోటు లభించింది. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర సంఘం ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మేకల అభినవ్ సంయుక్త కార్యదర్శిగా, అనిత ఈసీ మెంబర్‌గా, నవీన్ నిర్వహణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం బాధ్యులు నూతన కార్యవర్గాన్ని వెల్లడిస్తూ ఎన్నికైన వారిని అభినందించారు.
News February 18, 2025
NZB: ఎస్ఐని ఢీకొని పరారైన కారు

వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్ఐను ఓ వ్యక్తి కారుతో ఢీకొని పరారైన ఘటన NZBలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి RR చౌరస్తాలో 4వ టౌన్ ఎస్ఐ-2 ఉదయ్ వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ కారు వేగంగా వచ్చి ఆయణ్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎస్ఐకి గాయాలయ్యాయి. సిబ్బంది ఎస్ఐని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వాహనం ఆపకుండా పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు 4వ టౌన్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.