News February 4, 2025

NZB: త్రిపుర గవర్నర్‌ను కలిసిన తెలంగాణ ఉపాధ్యాయ బృందం

image

సీసీఆర్‌టీ ట్రైనింగ్‌లో భాగంగా త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలలో సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని తెలియజేస్తున్న సీసీఆర్టీ బృందాన్ని గవర్నర్ సన్మానించారు. ఈ బృందంలో నిజామాబాద్ జిల్లా ఉపాధ్యాయులు కలే గోపాల్, ప్రసన్న మాలిగిరెడ్డి, మురళీధర్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 6, 2026

NZB: పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల కోసం కలెక్టరేట్‌లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం చేసిన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం రాత్రి పరిశీలించారు. అలాగే ఫెసిలిటేషన్ సెంటర్‌ను నిశితంగా తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణ, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News February 6, 2026

కమ్మర్‌పల్లి: బాలబాలికల రాష్ట్ర వాలీబాల్ క్రీడలు ప్రారంభం

image

కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో 8వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ వాలీబాల్ ఛాంపియన్షిప్-2026 క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సర్పంచ్ కొత్తపల్లి హారిక మాట్లాడుతూ.. క్రీడలు ఆరోగ్యానికి మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతి విద్యార్థి పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

News February 6, 2026

NZB: ఎన్నికలపై అభ్యర్థులకు CM దిశా నిర్దేశం

image

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్‌కు మంచి వాతావరణం ఉందని, టికెట్ వచ్చిన వాళ్లు అందరినీ కలుపుకొనిపోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లో కి తీసుకెళ్లే దాన్ని బట్టే విజయావకాశాలు ఉంటాయన్నారు.