News August 13, 2024
NZB: దత్తత తీసుకున్న బాలుడికి చిత్రహింసలు..!

దత్తత తీసుకున్న ఓ పదేళ్ల బాలుడిని దారుణంగా హింసిస్తున్న ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని రాకాసిపేట్‌లో వెలుగులోకి వచ్చింది. ఓ జంట ఏడేళ్ల క్రితం ఎండీ ఫరీదుద్దీన్‌ను దత్తత తీసుకున్నారు. కొన్ని రోజులుగా వారి ఇంటి నుంచి అరుపులు కేకలు వినిపిస్తుడంతో స్థానికులు ఇంటి తాళం పగులకొట్టి లోపలికి వెళ్లి బాలుడిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. తనను హింసిస్తూ ఇంట్లో పనులు చేయిస్తున్నారని బాలుడు ఆరోపించాడు.
Similar News
News December 5, 2025
NZB: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు

రాష్ట్రస్థాయి సీనియర్ గర్ల్స్ ఇండియా రౌండ్ విలు విద్య పోటీలకు ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా విలువిద్య కార్యదర్శి గంగరాజు తెలిపారు. నిజామాబాద్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగారంలోని ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ రాజారం స్టేడియంలో నిర్వహించిన ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు హైదరాబాద్‌లోని కొల్లూరులో ఈనెల 7న ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాన్నారు.
News December 5, 2025
NZB: బలిదానాలు పరిష్కారం కాదు.. ఐక్యపోరాటం చేద్దాం: కవిత

బీసీ రిజర్వేషన్ల కోసం ఐక్య పోరాటాలు చేద్దామని, బలిదానాలు ఏమాత్రం పరిష్కారం కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సాయి ఈశ్వర్ చారి ఆత్మ బలిదానం చేసుకోవడం కలిచివేసిందన్నారు. కాంగ్రెస్ అధికారం కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతోనే సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్నారని ట్వీట్ చేశారు.
News December 5, 2025
నిజామాబాద్: మండలాల వారీగా నామినేషన్ల వివరాలిలా..!

ఆలూరు 11 GPల్లో SP-22, WM-113, ARMR 14 GPల్లో SP -51, WM -146, బాల్కొండ 10GPల్లో SP- 29, WM-108, BMGL27 GPల్లో SP-67, WM-224, డొంకేశ్వర్13 GPల్లో SP-36, WM-98, కమ్మర్పల్లి 14GPల్లో SP-35, WM-104, మెండోరా 11GPల్లో SP-34, WM-130, మోర్తాడ్-10 GPల్లో SP-23, WM-117, ముప్కాల్ 7GPల్లో SP-32, WM-97, NDPT22 GPల్లో SP-65, WM-276, వేల్పూర్ 18GPల్లో SP-53, WM-179, ఏర్గట్ల 8GPల్లో SP-22, WM-63 నామినేషన్లు.


